telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్ : ఒక కలల ప్రయాణం ప్రారంభమైంది…

Kausalya

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం “కౌసల్య కృష్ణమూర్తి”. ది క్రికెటర్‌ అనేది టాగ్‌లైన్‌. ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ కు మంచి స్పందన వచ్చింది. పల్లెటూరిలో రైతులు ఎదుర్కొనే కష్టాలు, క్రికెటర్ కావాలనుకునే యువతి ఆమె కోరికను ఏ విధంగా నెరవేర్చుకుంది అనేది చిత్ర కథాంశం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. “ఒక కలల ప్రయాణం ప్రారంభమైంది” అంటూ ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్రయూనిట్ ట్వీట్ పోస్ట్ చేసింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ట్రైలర్‌లో “నీ వల్ల కాదంటే నీవు నమ్మాల్సింది వాళ్లను కాదు.. నిన్ను’.. ‘ఈ లోకం గెలుస్తానని చెబితే వినదు.. గెలిచిన వాళ్ల మాట మాత్రమే వింటుంది. నువ్వు ఏం చెప్పినా గెలిచి చెప్పు” అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ఐశ్వర్యరాజేశ్ మహిళా క్రికెటర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు “యు” సర్టిఫికెట్ జారీ చేసింది. ఆగస్టు 23న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Related posts