telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పాత డైరీ… చెరగని జ్ఞాపకాలు

దుమ్ము పట్టి, శిధిలమైపోతున్న పుస్తకాలలో ,

బంధీయైయున్న, రాసుకున్న రాతలు ,

కాలానికతీతంగా చెరిగిపోకుండా ,

చిరునవ్వులు చిందిస్తున్నాయి..!!

ఎన్ని ఏళ్ళు గడిచినా, మారని మనసును 

ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి..!!

పెదవులపైకి ఎలా వచ్చిందో, తెలియని చిరుమందహాసం.!! రాసుకున్న రాతలే అవి..!!

కానీ కాలం మారినా,మారని గీతలు..!!

కాలం మారినా, మనిషిలో మార్పు రాని రాతలు..!!

ఎంత ఆశ్చర్యమో..!! 

దుమ్ము పట్టిన, జీర్ణమైపోయిన పాత పుస్తకాలే అవి..!!

కానీ, మనోఫలకంలో దాగిన నేస్తాలు..!! 

మనసును మైమరపించే అస్త్రాలు..!!

బంధీలుగా ఉన్న అక్షర కుసుమాలు..!! 

వలపుల వలలో చిక్కుకున్న మనోనేత్రాలు..!!

స్నేహాన్ని పొదివి పట్టుకున్న ఆపన్న హస్తాలు..!!

బాల్యాన్ని గుర్తు చేసే చిలిపి నవ్వుల చిరుజల్లులు..!!

కష్టాన్ని, సుఖాన్ని పొదివి పట్టుకున్న భాండాగారాలు..!! ఇంతకన్నా, ఏమని చెప్పాలి జ్ఞాపకాలు..!!

 

       

Related posts