కరోనా హెచ్చరికల నేపథ్యంలో కోల్ కతాలోని డమ్ డమ్ సెంట్రల్ జైలు ఖైదీలు రెచ్చిపోయారు. తమను బయటికి పంపించాలని వారు అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఖైదీలు ఆవేశానికి లోనవడంతో జైల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఖైదీలు జైలుకు నిప్పంటించారు. అగ్నికీలలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. కాగా, ఈ ఘటనలో కొందరు జైలు అధికారులపై ఖైదీలు దాడికి దిగినట్టు సమాచారం.
ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. సత్ప్రవర్తన చూపిన ఖైదీలకు కరోనా కారణంగా 15 రోజుల స్పెషల్ పెరోల్ ఇవ్వాలని జైలు అధికారులు నిర్ణయించడం కొందరు ఖైదీలకు రుచించలేదని, వారే జైలుకు నిప్పుపెట్టారని తెలుస్తోంది.