త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు, సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్రిసభ్య కమిటీతో చర్చిస్తున్నారు. భేటీలో మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్ ఎస్కేజోషి, డీజీపీ పాల్గొన్నారు. మూడు రోజులుగా కార్మిక సంఘాలతో జరిపిన చర్చలపై సీఎంకు అధికారులు వివరిస్తున్నారు.
సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి సీఎంకు త్రిసభ్య కమిటీ తెలపనుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై సీఎం స్పందన పట్ల కార్మిక సంఘాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

