బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ నిర్వహిస్తున్న షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ముగిసింది. షో చివరి రోజున ఇన్ఫోసిస్ ఫౌండేష్ చైర్‌పర్సన్ సుధామూర్తిని ఆహ్వానించారు. ఈ సందర్బంగా సుధామూర్తి తన జీవితానికి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. తనకు సినిమాలు చూడటమంటే ఎంతో ఇష్టమని, సినిమాలకు సంబంధించిన డైరెక్షన్, ఎడిటింగ్ వివరాలను తెలుసుకుంటానని అన్నారు. సినిమాల మీద ఇష్టంతో ఒక ఏడాదిలో రోజుకు ఒక సినిమా చొప్పున మొత్తం 365 సినిమాలు చూశానని తెలిపారు. ఇన్ని సినిమాలు చూశాక సినిమా రిపోర్టరుగా అయిపోవచ్చన్నారు. కాగా సుధామూర్తి 60 వేల లైబ్రెరీలు, వందల స్కూళ్లు, 16 వేలకు మించిన టాయిలెట్లు కట్టించారని అమితాబ్ ఈ సందర్భంగా తెలిపారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం దేశంలో అత్యంత రేటింగ్ సంపాదించుకున్న రియాలిటీ షోగా పేరొందింది. 19 ఏళ్ల కేబీసీ ప్రయాణంలో ఇప్పటికి 11 సీజన్లు పూర్తయ్యాయి. 10 సీజన్లకు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించారు. కౌన్ బనేగా కరోడ్‌పతి 11వ సీజన్‌లో భాగంగా జరిగిన చివరి ఎపిసోడ్‌లో సుధా మూర్తి పాల్గొన్నారు. ఆమె నేపథ్యం గురించి మాట్లాడుతూ వందల స్కూళ్లు, 60 వేల లైబ్రరీలు, 16 వేలకు పైగా టాయిలెట్స్ కట్టించిన గొప్ప మహిళగా సుధామూర్తి అమితాబ్ వివరించారు. తనకంటే వయసులో చిన్నదైనా సుధామూర్తి కాళ్లకు అమితాబ్ నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమె తాను చదువుకున్న కాలేజీలో టాయిలెట్ లేదని, అందుకనే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరపున టాయిలెట్స్ కట్టించి ఇచ్చానని సుధామూర్తి తెలిపారు. దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు తమ ఫౌండేషన్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ఆమె తెలిపారు.
next post

