ధనుష్ హీరోగా నటించిన తాజా సినిమా ‘కర్ణన్’. తమిళనాట సంచలన విజయం సాధించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వ్యూయర్స్ కోసం అందుబాటులోకి తెచ్చింది. థియేటర్లలో అద్భుతమైన స్పందనను తెచ్చుకున్న ‘కర్ణన్’కి మారి సెల్వరాజ్ దర్శకుడు. విమర్శకులు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వసూళ్ళు కూడా సాధించిన సినిమా ‘కర్ణన్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ధనుష్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ధాను ఈ సినిమాను నిర్మించారు. రాజీషా విజయన్, లాల్, యోగిబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
previous post