తమిళ సినీ నటులు రజినీకాంత్, కమల్‌హాసన్‌లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చెన్నైలోని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కార్యాలయ ప్రాంగణంలో సినీ దర్శకుడు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రజినీ, కమల్ పాల్గొన్నారు. వీరితో పాటు తమిళ పాటల రచయిత వైరముత్తు కూడా ఈ కార్యక్రమంలో వారితో పాటు ఉన్నారు. వైరముత్తుపై పలు లైంగిక ఆరోపణలున్నాయి. సింగర్ చిన్మయి తాను సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో వైరముత్తు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అప్పట్లో సంచలన ఆరోపణలు కూడా చేసింది. అలాంటి వ్యక్తితో కలిసి అగ్ర నటులైన కమల్, రజినీ వేదిక పంచుకుని ఏం సందేశమిస్తున్నారని చిన్మయి ప్రశ్నించింది. బాధితురాలినైన తనపై ఈవెంట్లలో పాల్గొనడకూడదంటూ నిషేధం విధించి, నిందితుడైన వైరముత్తును మాత్రం పలు ఈవెంట్లకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారని చిన్మయి మండిపడింది. మరో సింగర్ సోనా మొహపాత్ర కూడా ఈ ఘటనపై స్పందించింది. ప్రజల్లో గుర్తింపు కలిగిన కమల్, రజినీ లాంటి వ్యక్తులు ఇలాంటి వాళ్లతో కలిసి వేదిక పంచుకుంటుంటే సమాజంలో నైతిక విలువలు ప్రమాదంలో పడ్డాయని స్పష్టమవుతోందని ఆమె చెప్పింది. శ్రీరెడ్డి కూడా ఈ వివాదంపై స్పందించింది. ఇది కొత్తేమీ కాదని, అవినీతి, వేధింపులు చేతులు కలపడం సహజమేనని, వారంతా ఒకరినొకరు కాపాడుకునే వ్యక్తులేనని ఆమె చెప్పింది.
previous post
రానా కంటి సమస్య… నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు