కామసూత్ర, గేమ్ ఆఫ్ థ్రోన్స్ హీరోయిన్, భారత సంతతికి చెందిన 46 ఏళ్ల ఇందిరా వర్మ కరోనావైరస్ బారిన పడింది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. ఇందిరా వర్మకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఇందిరా ఈ విషయాన్ని తన ఫ్యాన్స్‌కు తెలిపింది. బుధవారం ప్రొడక్షన్ కు సంబంధించిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. కరోనా వ్యాపిస్తున్న కారణంగా తన షో ఆగిపోయినట్టుగా తెలిపింది. అంతేకాదు కరోనా కారణంగా తాను అనారోగ్యం పాలైనట్టుగా కూడా ఆమె పేర్కొంది. త్వరలోనే తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది ఇందిరా. హాలీవుడ్లో రాణిస్తున్న ఇందిరా వర్మకు భారత సంతతి మూలాలు ఉన్నాయి. తండ్రి ఇండియన్ కాగా, తల్లి స్విస్ దేశస్థురాలు. 1996లో కామసూత్ర: ఏ టేల్ ఆఫ్ లవ్, బ్రైడ్ అండ్ ప్రిజ్యుడీస్ అనే చిత్రాల్లో నటించింది. గేమ్ ఆఫ్ త్రోన్స్ ఎపిసోడ్స్ లో ఎల్లారియా సాండ్ పాత్రలో మెరిసి అందర్నీ మెప్పించింది. మరోవైపు గేమ్ ఆఫ్ త్రోన్ లోనే నటించిన మరో నటుడు క్రిస్టోఫర్ కు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. సోమవారం తన ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా అభిమానులకు ఈ విషయాన్ని క్రిస్టోఫర్ తెలిపారు.
previous post

