telugu navyamedia
సినిమా వార్తలు

జీవితానికి సిరివెన్నెల ఓ ప్రేరణ..

సినీ గేయ రచయిత సిరివెన్నెల మరణంపట్ల దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భావోద్వేగానికి లోనయ్యారు. జీవితంలో ఎన్నో మలుపులు, కుదుపులకు కుంగిపోతున్న తరుణంలో సిరివెన్నెల పద సాహిత్యం సందేశాత్మకంగా, మార్గ నిర్దేశనం చేశాయని రాజమౌళి పేర్కొన్నారు.

సినీ దర్శకుల్లో దిగ్గజం గా రాజమౌళి రాణిస్తున్న తీరు అందరికీ తెలిసినా… సినీ ప్రపంచంలో తాను వేసిన తప్పటడుగులు, మానసిక స్థయిర్యాన్ని పెంపొందించుకుని ఊహించని వైఫల్యాలనుంచి… అద్భుతమైన విజయాలను చేజిక్కించుకున్న జక్కన్న మనోగతానికి అక్షరం రూపమిచ్చారు.

కష్టాలొచ్చినపుడు కుంగిపోవద్దని వెన్ను తట్టిప్రోత్సహించిన తీరును గుర్తుచేసుకున్నారు. వైఫల్యాన్ని తలచుకుంటూ మనోవ్యధతో కుంగిపోతే… భవిష్యత్తు విజయాలను ఎలాపొందగలవనే ప్రేరణ సిరివెన్నెల సాహిత్యం మేల్కొలిపిందని ప్రస్తావించారు.

Related posts