telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రసాభాసగా మారిన డీఆర్సీ సమావేశం…

ycp ap

తమ సొంత పార్టీ నేతలే బహిరంగంగానే తిట్టుకోవడం ఇప్పుడు వైసీపీ అధినేతాకు తలనొప్పిగా మారింది. మొన్నైత్కి మొన్న విశాఖపట్నం డీఆర్సీ సమావేశంలో ఆ జిల్లా నేతలు ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకోగా ఆ తర్వాత సీఎం ఆఫీస్ వద్ద ఒక మంత్రిని మరో మంత్రిని మీడియా ముందే దుర్బాషలాడిన ఘటన సంచలనంగా మారింది. ఇక ఈ రోజు కూడ తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది.  టిడ్కో ఇళ్లు విషయంలో కాకినాడ లో అవినీతి జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది అని ఎంపీ బోస్ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ కేకలు వేశారు. ఒకే పార్టీ లో ఉంటూ నాకు చెప్పాలి కదా అని బోసు పై దుర్భాషలు ఆడారు ద్వారపూడి. మేడ లైన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు వల్ల కాకినాడ నగరం మునిగిపోయిందని బోస్ అన్నారు. అయితే ఈ విషయాలు నాకు చెప్పాలి కదా అని ఆవేశంతో  ఊగిపోయారు ద్వారంపూడి. మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు నచ్చ చెప్పడంతో రాసభాస మధ్యే సమావేశం పూర్తయింది. 

Related posts