లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా పరిచయమైన గ్లామర్ గళ్ కాజల్ తన యాక్టింగ్‌తో స్టార్ హీరోయిన్గా ఎదగింది. చందమామ, మగధీర లాంటి సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది.

ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, యంగ్ హీరోల పక్కన హీరోయిన్గా యాక్ట్ చేసి సూపర్ హిట్ సినిమాల్ని తన ఖాతాలో వేసుకుని తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

గత కొంత కాలంగా సీక్రెట్‌గా ప్రేమించుకున్న కాజల్, గౌతమ్ కిచ్లు 2020లో తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. అక్టోబర్ లో ఈ విషయాన్ని వెల్లడించింది కాజల్.

అక్టోబర్ 30న వీరి వివాహం కొద్ది మంది బంధుమిత్రులతో మధ్య గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత హనీమూన్ ఎంజాయ్ చేసిందీ జంట. ఆ వెంటనే తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంది. ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసుకుని మళ్లీ వ్యక్తిగత జీవితానికి పరిమితమయ్యింది. ఆ సమయంలోనే ప్రెగ్నెంట్ న్యూస్‌ని ప్రకటించింది.

తాజాగా అందాల చందమామ కాజల్.. మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. ఓ వైపు తన కుమారుడితో, మరోవైపు భర్త, ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంది.

భర్త గౌతమ్ కిచ్లు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపింది కాజల్. ఈ సందర్భంగా భర్త గౌతమ్ కిచ్లూ, కొడుకు నీల్ కిచ్లూతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫోటోను కాజల్ షేర్ చేసింది.

ఈ సందర్భంగా దిగిన ఫోటోని పంచుకుంటూ, ప్రపంచంలోనే అత్యంత గొప్ప తండ్రివైన నీకు హ్యాపీయెస్ట్ బర్త్ డే. మేము నిన్ను ప్రేమిస్తున్నాం గౌతమ్ కిచ్లు` అని పేర్కొంది కాజల్.

ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. కాజల్ భర్త,కొడుకు హెయిర్ స్టైల్ సూపర్ ఉందంటూ కితాబిస్తున్నారు నెటిజన్లు.


మగాళ్లను ద్వేషించే జాబితాలో లేను : శృతి హాసన్