హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆగివున్న ఉన్న ఇంటర్సిటీ రైలు ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎంఎంటీఎస్ డ్రైవర్ చిక్కుకుపోయారు. ప్రాణాపాయం నుంచి ఆయన బయటపడినప్పటికీ, తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
ఇంజన్లో ఉన్నఆయనకు ఆక్సిజన్ అందించడంతో పాటు సెలైన్ ఎక్కిస్తున్నారు. మరోవైపు, ఆయను కోచ్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రైల్వే సిబ్బంది తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మెటల్ తో తయారుకాబడిన కోచ్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనలో 30 మంది వరకు గాయపడ్డారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.



ఎమ్మెల్యే రసయయి మరోసారి సంచలన వ్యాఖ్యలు..