telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రీమేక్ కాదు… నిజ ఘటనల ఆధారంగా… రూమర్లపై స్పందించిన అక్షయ్

Bell-Bottom

వ‌రుస సినిమాల‌ను చేస్తూ స్టార్ హీరోలకు గట్టి పోటీస్తున్నారు బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్‌. ఇటీవలే “హౌస్ ఫుల్-4” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్షయ్. ఇత‌ర హీరోలంద‌రూ అక్ష‌య్ స్పీడు చూసి ఓ ర‌కంగా షాక‌వుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టికే నాలుగైదు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా… అక్ష‌య్ త‌న కొత్త సినిమాను అనౌన్స్ చేయ‌డం విశేషం. అక్ష‌య్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా “బెల్ బాట‌మ్‌”. రంజిత్ తివారి ద‌ర్శ‌కుడు. అనౌన్స్ చేసిన రోజునే సినిమాను జ‌న‌వ‌రి 22, 2021లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కూడా ప్రక‌టించాడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్ల‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా లుక్‌ను కూడా విడుదల చేశారు. అయితే అక్ష‌య్ సినిమాను అనౌన్స్ చేయ‌గానే.. ఇది క‌న్న‌డ చిత్రానికి రీమేక్ అనే వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై అక్ష‌య్ స్పందిస్తూ త‌న సినిమా దేనికీ రీమేక్ కాద‌ని, నిజ ఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని ఈ సినిమా సాగుతుంద‌ని ఆయ‌న తెలిపారు.

Related posts