telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు అనారోగ్యంతో యశోదా ఆస్పత్రిలో చేరారు

హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు చికిత్స కొనసాగుతుంది. KCR ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

కేసీఆర్‌ నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం KCR ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ప్రకటించారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

KCR ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రి వైద్యులు, అధికారులతో సీఎం మాట్లాడారు.

ఆయన త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం ఆకాంక్షించారు.

మరోవైపు ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోగ్తూ, ఇంటలిజెన్స్ అధికారులు యశోద ఆస్పత్రి కి చేరుకున్నారు.

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులతో సమీక్షిస్తున్నారు అధికారులు.

మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. మాజీ సీఎంకు అత్యున్నత, మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.

అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకుని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని బండి సంజయ్ ఆకాంక్షించారు.

ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరగగా, సోడియం లెవెల్స్ కాస్త తగ్గాయి.

ప్రస్తుతం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేసి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని యశోద వైద్యులు వెల్లడించారు.

Related posts