పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ.. ఎన్నికలు బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టిన జ్యోతుల.. జగ్గంపేటలో కార్యకర్తలు, అభ్యర్థుల సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ నిర్ణయంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి.. నేను వారితో కలిసి ఉండాలి అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. నాకు పార్టీలో పదవులు వద్దు.. కార్యకర్తలతో కలిసి.. కార్యకర్తగా ఉంటానంటూ ఈ సందర్భంగా వెల్లడించారు జ్యోతుల నెహ్రూ.. అయితే, ఇదే సమయంలో జగ్గంపేట నియోజకవర్గ ఇంఛార్జ్గానే కొనసాగుతానని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే పరిషత్ ఎన్నికలపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో చోటుచేసుకున్న ఈ పరిణామం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. చూడాలి మరి దీని పై ఇంకా మిగితా టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.
previous post
next post
కమ్మ సామాజిక వర్గంపై ఏపీ సీఎం కక్ష్య: సుంకర ఆరోపణ