తమిళ హీరో విష్ణు విశాల్, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ప్రేమలో ఉన్నట్టు చాలా మందికి తెలుసు. తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు జ్వాల ఇప్పటికే వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉంటోన్న జ్వాల.. చెన్నైలో ఉన్న విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్నానని ఈ ఏడాది మార్చిలో రివీల్ చేశారు. నేడు (జూలై 17న) విష్ణు విశాల్ పుట్టినరోజును పురష్కరించుకుని హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లిన జ్వాల.. బోయ్‌ఫ్రెండ్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘నా బర్త్‌డే సర్‌ప్రైజ్’ అని గుత్తా జ్వాలతో తీసుకున్న ఫొటోను విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో కేక్ కూడా ఉంది. మరోవైపు, జ్వాల కూడా ట్విట్టర్ ద్వారా విష్ణు విశాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే బేబీ’ అనే క్యాప్షన్‌తో తమ సెల్ఫీని ట్వీట్ చేశారు. కాగా విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి విష్ణు విశాల్ జ్వాలను కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. విష్ణు విశాల్‌కు ఇప్పటికే పెళ్లయింది. రజినీ నటరాజ్‌తో ఏడేళ్ల వైవాహిక జీవితం తరవాత 2018లో ఆమె నుంచి విష్ణు విశాల్ విడిపోయారు. వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. వీరికి 2017లో కొడుకు ఆర్యన్ జన్మించాడు. మరోవైపు, గుత్తా జ్వాలకు కూడా పెళ్లయిన విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో జ్వాల పెళ్లాడారు. 2011లో చేతన్ నుంచి జ్వాల విడిపోయారు.
My bday suprise…😁@Guttajwala pic.twitter.com/HPURz48K80
— VISHNU VISHAL – stay home stay safe (@TheVishnuVishal) July 16, 2020

