కమల్‌హాసన్ గారాల తనయ శృతిహాసన్ మంగళవారంతో 34వ పడిలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం లండన్ హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది శృతిహాసన్. ఈ బ్యూటీ తన పుట్టినరోజు వేడుకలను లండన్‌లో జరుపుకుంది. శృతిహాసన్ తన స్నేహితులతో కలిసి లండన్ వీధుల్లో తిరుగుతూ..డ్వీబీ డ్యాన్స్ చేసింది. “నాపై అమితమైన ప్రేమాభిమానాలు చూపిస్తోన్న ఫ్యాన్స్‌కు, ఆన్‌లైన్ కుటుంబానికి ధన్యవాదాలు. నాపై అందరి ప్రేమ, దీవెనలున్నాయి. నేను అదృష్టవంతురాలిని” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన పుట్టినరోజును మరిచిపోలేని విధంగా జరిపిన లండన్ స్నేహితులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రస్తుతం శృతి హాసన్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
previous post