telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీవారి సన్నిధిలో జాతిరత్నాలు

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా’తో తెలుగులో అరంగేట్రం చేసిన నవీన్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘జాతి రత్నాలు’. ఈ సినిమా ఈ నెల11న విడుదలై దూసుకపోతుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాహ్ హీరోయిన్‌గా నటించింది . ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాపై ఇప్పటికే పలుగురు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా విజయాన్ని చూసి చిత్ర హీరో నవీన్‌ పొలిశెట్టి ఎమోషనల్‌ అయి కంట కన్నీరు కూడా పెట్టకున్నారు. ఇది ఇలా ఉండగా.. జాతిరత్నాలు ఇంత మంచి విజయం సాధించిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకునేందుకు కాలినడకన కొండకు చేరుకుంది ఈ మూవీ టీం. ఈ రోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. నవీన్‌ పోలిశెట్టి.. కుర్తా, ధోతి ధరించి సప్రందాయమైన లుక్‌లో కనిపిస్తున్నాడు.

Related posts