టీడీపీ నాయకుడు, చిత్తూర్ మాజీ ఎంపీ శివప్రసాద్ శనివారం మధ్యాహ్నం చెన్నై అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన మృతి పై ఓ ప్రకటన విడుదల చేశారు.
“ప్రత్యేక హోదా డిమాండ్‌పైనా పార్లమెంట్‌లో శివప్రసాద్ తనదైన శైలిలో స్పందించారు. తనలోని కళాకారుడి ద్వారా పలురీతుల్లో నిరసనలు చేపట్టారు. శివప్రసాద్ తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధపడ్డాను. నటుడిగా అటు చలనచిత్ర రంగంలోనూ, నాయకుడిగా ఇటు ప్రజా జీవితంలో తనదైన పంథాలో వెళ్లారు. ఎంపీగా, రాష్ట్ర సమాచార శాఖ మంత్రిగా శివ ప్రసాద్ ఎన్నో సేవలందించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
నలుగురు ఎంపీలు గెలవగానే ఊహల్లో విహరిస్తున్నారు: ఉత్తమ్