telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అంతిమంగా గెలిచి నిలిచేది ఆత్మగౌరవమే..

భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్బంగా ఏపీ ప్రభుత్వం తీరు ఆశ్చర్యాన్ని కలిగించిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య భావాలపై విశ్వాసం ఉన్న నాయకులు వైసీపీని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందన్నారు. 

ఆత్మగౌరవంతో ఉన్న మీరు పార్టీ నుంచి బయటకు రండి. మాతోపాటు నడిచి ప్రయాణం చేయండి. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వెళ్తూ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ చూపిద్దాం.

నా ఆలోచన మేరకే ప్రతి ఒక్కరు పనిచేయాలనే భావనతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియంతలా ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ తో కలసి నడిచేందుకు రండి అని పిలుపునిచ్చారు..పవన్ కళ్యాణ్ నాయకత్వంలో వెళ్తూ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ చూపిద్దాం.

పవన్ కల్యాణ్ సినిమా విడుదలైన థియేటర్లలో ప్రభుత్వ సిబ్బందిని నియమించడం బాధాకరమన్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన రెవెన్యూ సిబ్బందిని సినిమా హాళ్ల దగ్గరకు పంపారు.సినిమాకు వచ్చేవారిని భయబ్రాంతులకు గురిచేసేందుకు ఉద్యోగులను థియేటర్ల వద్ద ఉంచారని మండిపడ్డారు.

అహంభావానికి, ఆత్మగౌరవానికి జరిగే పోరులో గెలిచేది ఆత్మ గౌరవమే భీమ్లానాయక్ సినిమా అని నిరూపించారు. సంయమనంతో… సహనంగా ఉన్న జన సైనికులకు, అభిమానులకు అభినందనలు అని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డంపెట్టుకొని అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణం తీసుకొచ్చారు. ప్రజా సమస్యలు తీరుస్తారని నమ్మి అధికారం ఇస్తే… జగన్ రెడ్డి ఇటువంటి పాలన అందిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. కక్ష పూరితంగా, చిన్నమనస్తత్వంతో సామాన్యూలను ఇబ్బంది పెట్టారని మనోహార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts