ఏపీ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ నేడు బాధ్యతలు స్వీకరించారు.
ఈనెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అసెంబ్లీ నిర్వహణపై మంత్రి సంతకాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
రానున్న శాసనసభ సమావేశాలలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్నామని అన్నారు.
శాసన సభ ఏర్పాట్లకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకాలు చేశానని చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.
జగన్ శాసనసభ రావాలి.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నామని కేశవ్ చెప్పారు.
స్వపక్షమైనా, విపక్షమైనా మేమే.. ప్రజలకోసం ఏ పాత్ర పోషించడానికైనా మేం సిద్ధంగా ఉంటామని పయ్యావుల స్పష్టం చేశారు.


చంద్రబాబు నివాసంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు