telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడంపై సీపీఐ నారాయణ స్పందించారు

వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.

అసెంబ్లీకి వెళ్లకపోతే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన డీలిమిటేషన్ అంశంపైనా నారాయణ తన అభిప్రాయాలను వెల్లడించారు.

లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజన (డీలిమిటేషన్) జరిగితే దక్షిణాదిలో కేవలం 14 సీట్లే పెరుగుతాయని అదే ఉద్తరాదిలో ఏకంగా 150 సీట్లు పెరుగుతాయని అన్నారు.

కేంద్రం వైఖరి సరి కాదని మరో ఐదేళ్లు ఇలాగే పాలిస్తే దేశం రెండుగా విడిపోతుందని స్పష్టం చేశారు.

Related posts