telugu navyamedia
క్రీడలు వార్తలు

ఈరోజు భారత తొలి టెస్ట్ కెప్టెన్ 125వ జయంతి…

భారత తొలి టెస్ట్ కెప్టెన్ అయిన సి.కె.నాయుడు 125వ జయంతి నేడు. ఈ సందుదర్బంగా జనసేన పార్టీ ” క్రికెట్ అంటే మక్కువ చూపని భారతీయులు బహు అరుదుగా ఉంటారు. నేడు అధిక సంఖ్యాక భారతీయ యువత క్రికెట్ అంటే మైమరచిపోతారు.మన జీవితాలపై ఇంతటి ప్రభావాన్ని చూపుతున్న క్రికెట్ అనే పుస్తకానికి ముఖ చిత్రం మన తెలుగు బిడ్డడే. ఆయనే సి.కె.నాయుడు గా ప్రసిద్ధి చెందిన కొఠారి కనకయ్య నాయుడు. ఆయన మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో తెలుగు కుటుంబంలో జన్మించారు. నేడు ఆయన 125వ జయంతి. ఆయన తాత ముత్తాతలు కృష్ణా జిల్లా మచిలీపట్టణం నుంచి మహారాష్ట్రకు వలస వెళ్లారు. నాయుడు గారి జయంతి సందర్భంగా నా తరపున, జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారత టెస్ట్ క్రికెట్ కు ఆయన తొలి కెప్టెన్ కావడం మన తెలుగువారందరికీ గర్వ కారణం. సి.కె.నాయుడు పుట్టింది మహారాష్ట్రలోనైనా ఆయన తుది శ్వాస విడిచే వరకు తెలుగు సంప్రదాయాలను, పద్దతులను పాటించారు. అటువంటి గొప్ప క్రీడాకారుడు మన తెలుగువాడు కావడం మన అందరి అదృష్టం” అని ట్విట్టర్ లో పేర్కొంది.

Related posts