telugu navyamedia
క్రీడలు వార్తలు

పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం.

T20 WC న్యూయార్క్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో పాకిస్థాన్ పై టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 119 పరుగులకే ఆలౌట్ అయింది.

రిషభ్ పంత్ (42 రన్స్‌) మినహాయిస్తే ఎవ‌రూ పెద్దగా రాణించలేదు.

పాక్ బౌలర్ నసీమ్ షా 3 వికెట్లు పడగొట్టి భారత జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు.

ఆ తర్వతా బ్యాటింగ్ బరిలోకి దిగిన పాకిస్థాన్ ని మన ఇండియన్ బౌలరులు 113/7 స్కోరుకే కట్టడి చేసింది.

జస్ప్రీత్ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24), అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్.

Related posts