telugu navyamedia
రాజకీయ వార్తలు

త్వరలో బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది

ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల వివరాలను వెల్లడించింది.

దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనుంది.
బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది.

గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు.
మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18-29 ఏళ్ల మధ్య వయసున్న యువత ఉన్నారు.

Related posts