telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సుప్రీం పీఠంపై తెలుగు బిడ్డ.. సీజేఐగా నేడే జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రమాణం

జస్టిస్ రమణ ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం చేస్తూ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌కోవింద్‌ కీలక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి. రమణ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ లో ఇవాళ ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణ తో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం చేయించనున్నారు. మొదటి సారి తెలుగు వ్యక్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నాడు. కాగా   2014 ఫిబ్రవరి 17 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన… అంతకు మందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. 1957 ఆగష్టు 27న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించిన ఆయన…1983 ఫిబ్రవరి 10 న న్యాయవాదిగా ప్రాక్టీస్ ను ప్రారంభించారు జస్టిస్ ఎన్.వి.రమణ. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియామకమైన ఆయన… 2013 మార్చి 10 నుండి 2013 మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 

Related posts