telugu navyamedia
క్రీడలు

“కళ్ళు కనిపించట్లేదా” అంటూ కోహ్లి అస‌హానం..!

భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ నాలుగో రోజు చివర్లో జరిగిన ఒక సంఘటన చర్చనీయాంశంగా మారింది. రవీంద్ర జడేజా మొయిన్ అలీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన తరువాత గ్రీజులోకి వచ్చిన ఇషాంత్ శర్మ.. రిషబ్ పంత్ తో కలిసి బ్యాటింగ్ కి దిగాడు. మ్యాచ్ ముగియడానికి మరో పది ఓవర్లు మిగిలి ఉండటంతో గ్రౌండ్ లో వెలుతురు సరిగ్గా లేకున్నా మ్యాచ్ ను అలానే కొనసాగిస్తుడటంతో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

IND vs ENG: Virat Kohli, Rohit Sharma Complain About Bad Light From Lord's Balcony During 2nd Test | WATCH VIDEO

సాధారణంగా వెలుతురు సమస్య ఉన్నప్పుడు బ్యాట్స్ మెన్ అంపైర్ కి అప్పీల్ చేస్తే మ్యాచ్ ను అక్కడితో ఆపేస్తారు కాని అంపైర్ ని అడగడానికి రిషబ్ పంత్ కాస్త సందేహించడంతో కోపంతో విరాట్ కోహ్లి కళ్ళు కనిపించట్లేదా వెలుతురు సరిగ్గా లేదుగా ఎలా ఆడుతారని సైగ చేయడంతో వెంటనే రిషబ్ అంపైర్ కి చెప్పడంతో అంతటితో మ్యాచ్ ని ముగించేశారు. చివర్లో వెలుతురు సమస్య ఉన్న సమయంలో తెలివిగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ కొత్త బంతి తీసుకునే సమయంలోనే వెంటనే విరాట్ కోహ్లి ఇలా నిర్ణయం తీసుకొని ఆఖరు ఓవర్లలో వికెట్స్ పడకుండా కాపాడాడనే చెప్పాలి.

Virat Kohli was frustrated at his dismissal and vented his anger which was seen by everyone on live tv.

అంతేకాకుండా ఈ టెస్టులో 4వ రోజు విరాట్ కోహ్లీ 20 పరుగులకే వెనుదిరిగాడు. అయితే దీనిపై కోహ్లీ తన నిరాశను ప్రదర్శిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో టవల్‌ను విసిరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై కొంత మంది నెటిజన్లు కోహ్లీకి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు ట్రోల్‌ చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు.

Related posts