telugu navyamedia
pm modi రాజకీయ వార్తలు

మయన్మార్ భూకంపం సహాయ కార్యక్రమాల్లో తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధం: నరేంద్ర మోదీ

మయన్మార్  భూకంపం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భూకంపంలో చిక్కుకున్న ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోదీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు.

మయన్మార్ ను రెండు వరుస భూకంపాలు కుదిపేశాయి. 12 నిమిషాల వ్యవధిలో ఈ రెండు భూకంపాలు సంభవించినట్టు రికార్డయింది.

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూలిపోయిన ఓ భవనం శిథిలాల్లో 43 మంది చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు.

మొదట వచ్చిన భూకంపం తీవ్రత 7.7 కాగా రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది.

థాయిలాండ్ లో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అటు, బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోనూ 7.3 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు.

Related posts