ఇండియా లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 31,222 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,30,58,843కి చేరింది. ఇందులో 3,22,24,937 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 3,92,864 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.
ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో మహమ్మారి నుంచి 42,942 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 290 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,41,042కి చేరింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 69,90,62,776 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క కేరళలోనే 19,688 కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న 135 మంది ప్రాణాలు కోల్పోయారు.