దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 94 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 36,604 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 501 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 43,062 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,99,414 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,28,644 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 89,32,647 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,38,122 నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 94 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 5. 44 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.47 శాతానికి మరణాల రేటు తగ్గింది. ఇటు గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన “కరోనా” టెస్ట్ ల సంఖ్య10, 96, 651 కు చేరింది.
previous post
next post


బలనిరూపణ వెనుక బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్: కుమారస్వామి