ఉక్రెయిన్ విమానం ఒకటి కైరోలోని షర్మ్ ఎల్-షేక్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. అయితే ఎయిర్‌పోర్టు గ్రౌండ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈజిప్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం… స్కైప్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఎస్‌క్యూపీ7153 విమానం జాపోరిజియా నగరం నుంచి బుధవారం కైరోకు వచ్చింది. కైరోలోని షర్మ్ ఎల్-షేక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే క్రమంలో హైడ్రాలిక్ ఆయిల్ లీకైయి తారురోడ్డుకు పాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన ఎయిర్‌పోర్టు గ్రౌండ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. మంటలు విమానం మొత్తానికి వ్యాపించకముందే అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
next post

