telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఈ బడ్జెట్ లో రూ.10 లక్షల వరకూ లోన్

విద్యాశాఖకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసింది. విద్య, ఉద్యోగ, స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేకంగా పథకాలు ప్రకటించింది.

మొత్తంగా 5 స్కీమ్లు అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మొత్తంగా రూ.2 లక్షల కోట్ల కేటాయింపులు చేసింది.

ఉద్యోగాల కల్పనకు సంబంధించి మొత్తం మూడు పథకాలు అమలు చేస్తామని తెలిపారు.

నైపుణ్య శిక్షణపైనా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు. విద్యారంగానికి తోడ్పాటునిచ్చేందుకు వీలుగా దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే వాళ్లకు రూ. 10 లక్షల వరకూ లోన్ ఇస్తామని కీలక విషయం వెల్లడించారు.

Related posts