ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా సాగాయి. పోలింగ్ శాతం భారీగా పెరిగిపోయింది. దేశంలోనే రికార్డు స్దాయిలో 82 శాతం పోలింగ్ నమోదైన ఏపీ ఎన్నికల ఫలితంపైనే ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది.
ప్రముఖ అధ్యయన సంస్థ CSDS లో సీనియర్ సెఫాలజిస్ట్ గా ఉన్న ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పేశారు.
రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగిందని ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తెలిపారు.
ఈ పోరులో టీడీపీదే పైచేయి అయిందని ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉండటంతో నంబర్లు చెప్పకపోయినా టీడీపీ గెలవబోతోందనే సంకేతం ఇచ్చారు.
అలాగే రాష్ట్రంలో బీజేపీ టీడీపీతో జట్టు కట్టడం వల్ల కొన్ని ఎంపీ సీట్లు గెల్చుకోబోతోందని సంజయ్ కుమార్ వెల్లడించారు.
మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ బలంగానే ఉందని, ఈసారి జాతీయ స్ధాయిలో ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు లేకపోయినా బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్ధితి ఉందని ఆయన చెప్తున్నారు.
ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదు: లక్ష్మీపార్వతి