telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నూతన విద్యావిధానాన్ని స్వాగతించిన జనసేన

pawan

కేంద్రం విద్యావిధానం తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని జనసేన స్వాగతిస్తోందని తెలిపారు. ఐదో తరగతి వరకు మాతృభాషలో బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని యునెస్కో 2008లోనే ప్రకటించిందని తెలిపారు. ఇటీవల ఏపీ సర్కారు ఇంగ్లీషు మీడియంపై నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన ఇందుకోసమే వ్యతిరేకించిందన్నారు.

జనసేన ఇంగ్లీషు మీడియం బోధనకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఏపీలో ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే వ్యతిరేకించామని పేర్కొన్నారు. తమ పిల్లలు ఏ భాషలో చదవాలన్నది తల్లిదండ్రుల నిర్ణయానికే వదిలేయాలని, ఇంగ్లీషు మీడియం ఓ ఆప్షన్ గా మాత్రమే ఉండాలన్నది జనసేన పార్టీ అభిప్రాయం అని పవన్ స్పష్టం చేశారు.

Related posts