telugu navyamedia
సినిమా వార్తలు

ఇళయరాజా సంచలన ప్రకటన

Ilayaraja songs producers Filed Petition High court

మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం ఎంత విన‌సొంపుగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 76 ఏళ్ళ వ‌య‌స్సులోను ఆయ‌న అద్భుత‌మైన సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ ఆంటోనీ న‌టిస్తున్న త‌మిజ‌ర‌స‌న్ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తున్నారు విజయ్ ఆంటోనీ. అయితే నిన్న ఇళ‌య‌రాజా బ‌ర్త్‌డే కావ‌డంతో నిన్న చెన్నైలో పెద్ద మ్యూజిక‌ల్ కాన్స‌ర్ట్ ఏర్పాటు చేశారు. భారీ జ‌న‌సందోహం మ‌ధ్య జరిగిన ఈ కాన్స‌ర్ట్‌లో ఇళ‌య‌రాజా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సినీ సంగీత కారుల యూనియ‌న్‌, ట్ర‌స్ట్ భ‌వ‌నం త‌న సొంత ఖ‌ర్చుల‌తో నిర్మించ‌నున్న‌ట్టు ఇళ‌య‌రాజా ప్రకటించారు. ఆయ‌న నిర్ణ‌యం ప‌ట్ల సినీ ప్ర‌ముఖులు, అభిమానులు, సంగీత ప్రియ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Related posts