సామాజిక మాధ్యమాలు లింక్డ్ ఇన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిండర్ ఛాలెంజ్ లో ఐసీసీ కూడా పాల్గొంది. వివిధ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ తమ ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా చాలా మంది నటీనటులు ఇందులో పాల్గొంటున్నారు. మరోవైపు ట్రెండింగ్ విషయాల్లో తామేం తక్కువ కాదన్నట్టు శనివారం ఐసీసీ కూడా ఈ ఛాలెంజ్‌లో పాలుపంచుకుంది. ఇద్దరి క్రికెటర్ల ఫొటోలను ట్వీట్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. టీమ్ ఇండియా టెస్టు బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా ఒకరు కాగా.. మరొకరు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్‌స్మిత్. తొలుత పుజారా ఫొటోలను షేర్ చేసిన ఐసీసీ, ఒకే ఫొటోను నాలుగింటికి ఉపయోగించింది.
పుజారా ఎప్పుడూ ఒకేలా ఉంటాడనే విషయం అర్థం వచ్చేలా ఇలా పోస్టు చేయడం విశేషం. కాసేపటికి స్టీవ్‌స్మిత్ ఫొటోలను కూడా షేర్ చేయగా అందులో చివరి దానికి లబుషేన్‌ను జతచేసింది. దానికి డూప్లికేట్ అకౌంట్ అంటూ హాస్యాస్పదంగా పేర్కొంది. ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో స్టీవ్‌స్మిత్ తలకు గాయమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లబుషేన్ అతడికి కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి ఆసీస్ జట్టులో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవల టీమ్ ఇండియాతో జరిగిన వన్డే సిరీస్‌కు ఎంపికై మంచి పరుగులు చేశాడు.
నీ స్పీడ్ కాంగ్రెస్ లో చెల్లదు ..రేవంత్ కు వీహెచ్ చురకలు