telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కక్ష సాధింపు చర్యలు వద్దని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే చెప్పాను: ఉండవల్లి

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే కక్ష సాధింపు చర్యలు వద్దని అప్పుడే చెప్పానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

పోలీసులను జైల్లో పెట్టవద్దని అన్నారు. చాలా మంది ఐపీఎస్, ఐఏఎస్లు తనకు స్నేహితులుగా ఉన్నారని తెలిపారు.

అందులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని ఆంజనేయులు జైలుకి వెళ్లినప్పుడు చూడటానికి వెళ్లానని అన్నారు.

డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే తొలిసారని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

ఏపీ పునర్వభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి నేటికి 11 ఏళ్లు పూర్తయిందని వెల్లడించారు.

పవన్ కల్యాణ్ కు ఇప్పటికే ఈ విషయంపై లేఖ రాశానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కేసుకు ఒక ఆశాజ్యోతి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

ఉగ్రవాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని తెలిపారు.
ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

భారతదేశంతో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్‌ కు లేదని చెప్పారు. యుద్దం జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందని అన్నారు. మతం ప్రధానమనేది భారతదేశంలో సరికాదన్నారు.

ఇండియాలో 12 శాతం ముస్లింలు ఉన్నారని తెలిపారు. పాకిస్తాన్లో హిందువులు ఒక్క శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు.

ముస్లింలపై వ్యతిరేకత సృష్టించకూడదని కానీ పాకిస్తాన్‌ ను వ్యతిరేకించాలని అన్నారు.

ప్రస్తుత తరుణంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టకూడదని చెప్పారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు.

Related posts