హైదరాబాద్ నగరంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ఖాళీలు భర్తీ చేసేందుకు నిరుద్యోగ యువత ధరఖాస్తూ చేసుకోమని ప్రకటించింది. వీటితో పాటు ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్బీఐ. మొత్తం 17 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 30న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు : 17
లీగల్ ఆఫీసర్ గ్రేడ్ బీ- 1; మేనేజర్ (టెక్నికల్)- 2; అసిస్టెంట్ మేనేజర్ (రాజ్భాష)- 8; అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ)- 5; లైబ్రరీ ప్రొఫెషనల్స్- 1.
దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 30
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 20
ఎగ్జామ్- 2020 ఫిబ్రవరి 15
దరఖాస్తు ఫీజు- రూ.600. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100