telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాజాసింగ్‌పై 101పైగా క్రిమినల్ కేసులు నమోదు : సీవీ ఆనంద్

*రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు
*రాజాసింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలింపు
*రాజాసింగ్‌పై ఇప్పటివరకు 101పైగా క్రిమినల్ కేసులు నమోదు 
*మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రాజాసింగ్‌పై రౌడీషీట్.
*తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న రాజాసింగ్
*వీడియో కారణంగానే నిరసనలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ నమోదు అయినట్లు హైదారబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. . రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అన్నారు. మత ఘర్షణలు చోటుచేసుకునేలా రాజాసింగ్ ప్రసంగాలు ఉన్నాయని చెప్పారు. 

మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులు ఆధారంగా చేసుకొని రాజాసింగ్ పై పీడి యాక్ట్ పెట్టినట్లు చెప్పారు..

కాగా ఈనెల 22న ఓ యూట్యూబ్‌ చానల్‌లో రాజాసింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహ్మద్‌ ప్రవక్తను వ్యతిరేకంగా అభ్యంతరకరంగా రాజాసింగ్‌ మాట్లాడారని అన్నారు.  

 ఆ వీడియో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందన్నారు.  ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజాసింగ్ మీడియాకు ప్రకటించారని చెప్పారు. మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటు చేసుకన్నాయని చెప్పారు. ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు

ఇక‌పోతే..2004 నుంచి ఇప్పటివరకు రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు.  ఇందులో 18 మతపరమైన కేసులు  ఉన్నాయని చెప్పారు.వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్నికోర్టు విచారణలో ఉన్నాయి.

Related posts