తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసే జేఏసీ, అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు మద్దతు ప్రకటించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు తమ కార్యాచరణను సిద్ధం చేశారు.
ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధులకు రావద్దని కోరారు. బస్సులో ప్రయాణించేవారికి టికెట్లు ఇచ్చి, ఆర్టీసీకి మరింత నష్టం చేకూరకుండా వ్యవహరించాలని సూచించారు. 23వ తేదీన ప్రజాప్రతినిధులను కలిసి తమ డిమాండ్లను వివరించాలని నిర్ణయించారు. ఈ నెల 26న ఆర్టీసీ కార్మికులు పిల్లలతో ధర్నా చేయనున్నారు 28, 29న నిరసన ప్రదర్శలను చేపట్టనున్నారు.
ప్రజావేదిక అక్రమ కట్టడమనడం జగన్ అవగాహనా రాహిత్యం: అనురాధ