మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కు చెందిన తోనేగర్ పర్వత్ సింగ్(36) తన భార్య గత నాలుగు సంత్సరాల నుండి కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురై క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం నర్సంపేట లో వివాహ వేడుకకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు పర్వత్. అయితే మృతునికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతితో 6 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఓ సంవత్సరం పాటు అన్యోన్యంగా ఉన్న దంపతులకు ఒక పాప కూడా ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం పర్వత్ భార్య భర్తతో గొడవపడి తన బిడ్డను తీసుకుని కర్ణాటకకి వెళ్ళింది. కాపురానికి రావాలని భార్యను వేడుకున్నా రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు పర్వత్. పర్వత్ మృతితో ఇందిరా నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
							previous post
						
						
					
							next post
						
						
					

