telugu navyamedia
సినిమా వార్తలు

“మా ” ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు ..

ఆదివారం ఉదయం హైదరాబాద్ జూబిలీహిల్స్ స్కూల్ లో “మా “ఎన్నికల పోలింగ్ ఉదయం 8. 00 గంటలకు మొదలై 2. 00 గంటలకు ముగుస్తుంది . సాయంత్రం 4.. 00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది .

ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు . ఈ ఇద్దరు రెండు గ్రూపులుగా మారి పోరాటం చేస్తున్నారు . గత పదిహేను రోజుల నుంచి “మా ‘ఎన్నికల ప్రచారం జరుగుతుంది . గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది . ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ శక్తి యుక్తులను ఉపయోగిస్తున్నారు .

రేపు జరిగే “మా “ఎన్నికలకు పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నట్టు తెలుస్తుంది . ఇప్పటికే రెండు గ్రూపులు మాటలతో మంటలు రాజేస్తున్నారు . సభ్యులను ప్రలోభ పెడుతున్నారు , బహుమతులు కూడా అందిస్తున్నారనే మాట వినిపిస్తుంది . ఇక ప్రచారం మొదలైన నాటి నుంచి మందు , విందుతో మచ్చిక చేసుకుంటున్నారని కూడా వార్తలు అందుతున్నాయి .

Vishnu Manchu announces MAA panel members - English

ఈ నేపధ్యలో అనూహ్య పరిణామాలు , అనవసరమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉండొచ్చనే ఉద్దేశ్యం తో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారట.ఎన్నికలు జూబిలీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో జరగబోతున్నాయి. “మా ‘ఎన్నికలు అంటే సినిమా తారలు వస్తారు , వారిని చూడటానికి అభిమానులు , సామాన్య ప్రజలు రావచ్చు . అందుకే జూబిలీహిల్స్ స్కూల్ కు వెళ్లే రహదారుల్లో పోలీసులు మోహరించి , “మా ” మరియు మీడియా ను మాత్రమే అనుమతించే అవకాశం వుంది .

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూలు వేదికగా 'మా' ఎన్నికల పోలింగ్ | ap7am

రేపు ఉదయం 8. 00 గంటలకు అన్ని చానెల్స్ జూబిలీహిల్స్ స్కూల్ నుంచి లైవ్ కార్యక్రమాలు ఉంటాయి . రెండు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచం నాలు మూలల వున్న తెలుగు వారు “మా ” లైవ్ కార్యక్రమాలు చూసే అవకాశం వుంది. ఇప్ప‌డు “మా ” ఎన్నికలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. .

Related posts