telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగబాబు కొత్త షో… “లోకల్ గ్యాంగ్” ప్రోమో

Nagababu

బుల్లితెరపై పాపులర్ అయిన “జబర్దస్త్” కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతగానో ప్రజాదరణ పొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ కార్యక్రమంలోని ప్రతీ ఒక్క టీమ్ అద్భుత కామెడీతో, పంచ్‌లతో ప్రేక్షకులకు కావాల్సినంత నవ్వుల విందును అందజేస్తాయి. గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ షోకు అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానులే. గ‌త ఏడు సంవ‌త్స‌రాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌లో నవ్వులు పూయిస్తున్న పాపులర్ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. నాగ‌బాబు, రోజా జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి అన‌సూయ‌, ర‌ష్మిలు యాంకర్స్‌గా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా నాగబాబుతో పాటు చ‌మ్మ‌క్ చంద్ర‌, అదిరే అభిలు జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం నుండి బ‌య‌ట‌కి వచ్చారు. ఇవాల్టీ నుంచి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానున్న ’లోకల్ గ్యాంగ్’ లో ఇక నుంచి ఆయన కనపించనున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రొమో జీ తెలుగు ఛానల్ తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది. ఈ ప్రొమోలో యాంకర్ అనసూయ, ప్రదీప్, రవి, శేఖర్ మాస్టర్, మెగా బ్రదర్ నాగబాబు కనిపించారు. శేఖర్ మాస్టర్, అనసూయ తమ డాన్స్‌తో అదరగొట్టారు. ఇక రవి, ప్రదీప్ తమ యాంకరింగ్ ఫెరఫామెన్స్ చూపించారు. నాగబాబు ఎంట్రీ అదిరిపోయింది. నాగబాబు స్టేజ్‌పైకి రాగానే.. అక్కడున్న యూత్ అంతా ఈలలు వేసి గోలలు చేశారు. ఇక ఈ ప్రొమోలో కాలేజీ లైఫ్, లవ్ స్టోరీలు గురించి ప్రదీప్ మనకు కనిపించాడు. నాగబాబు లవ్ స్టోరీ గురంచి అడిగాడు. దీంతో ఆయన తన లైఫ్‌లో అన్నీ వన్ సైడ్ లవ్ స్టోరీలే అంటూ చెబుతూ అందర్నీ నవ్వించారు. ఏనాడు కాలేజీకి సరిగా వెళ్లలేదన్నారు. చాలా ఇంట్రస్టింగ్ టాపిక్స్‌తో వస్తున్న ఈ షో ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts