telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు

గుంటూరు జిల్లా మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్నాతకోత్సవంలో పాల్గొని మంగళవారం సాయంత్రం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లారు.

విమానాశ్రయం వద్ద అధికారులు వీడ్కోలు పలికారు.

వీడ్కోలు పలికిన వారిలో
రాష్ట్ర గవర్నర్ గౌరవనీయ అబ్దుల్ నజీర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ, ఐసిడిఎస్ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డిజిపి సిహెచ్. ద్వారక తిరుమలరావు, కమాండింగ్ ఆఫీసర్ 22 ఆంధ్రా బెటాలియన్ ఎన్ సిసి లెఫ్ట్నెంట్ కన్నల్ జే. మహేష్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు.

Related posts