తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్ నగర శివారులోని మియపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడాన్ని కోర్టు తప్పు పట్టింది. రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారమయ్యే వరకు స్టే విధించింది. మియపూర్ భూములను యధావిధిగా ఉంచాలని స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది. చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల కోర్టుకు సానుభూతి ఉండదని క్లారిటీ ఇంచ్చింది.
							previous post
						
						
					
							next post
						
						
					

