రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా.. మార్చి4 సాయంత్రం 5.04నిమిషాలకు ఈ చిత్ర టీజర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు. ‘అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా.. రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి మాత్రం రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు’ అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్ ఆద్యంతం హిలేరియస్‌గా ఆకట్టుకుంటోంది. అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఒక ఫ్లిఫ్ కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్ మై షో,ఒక క్రెడిట్ కార్డ్ అని చెప్పే డైలాగ్ బాగుంది. అలాగే మందుందా? అని హీరోయిన్ అడిగిన ప్రశ్నకి నా దగ్గర పెద్దగా బ్రాండ్స్ లేవమ్మా.. అని నరేష్ చెప్పే డైలాగ్. దానికి సమాధానంగా భాదకి బ్రాండ్స్ తో పనేంటి డాడీ అని చెప్పే డైలాగ్ మరింత ఎంటర్ టైనింగ్ గా ఉంది. ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకాబోతుంది.
previous post

