శుక్రవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌నగరం తడిసి ముద్దైంది. సుమారు మూడు-నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లోని కాలనీలు చెరువులను తలపించాయి.
కొన్ని లోతట్లు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. సుమారు నడుముల లోతు మేర కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానిక ప్రజలు, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ జలమయంగా మారాయి. కొత్తగూడ-హాఫీజ్‌పేట్ ప్లైఓవర్‌పై ఏకంగా నడుముల్లోతు నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆ నీటిలోంచి ముందుకు వెళ్లలేక చాలా సేపు ఫ్లైబర్‌పైనే ఆగిపోయారు. వర నీరు కాస్త తగ్గిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వర్షం కారణంగా ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ఐకియా గుండా హటెక్ సిటీ వెళ్లే మార్గంలో చాలా సేపు వాహనాలు రోడ్లపై ట్రాఫిక్‌లోనే నిలిచిపోయాయి.
హైటెక్ సిటీ నుంచి కేపీహెచ్‌బీ మార్గంలోని ఫ్లైఓవర్‌పై సైతం భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.
ఇక్కడే కాకుండా, మియాపూర్-గచ్చిబౌలి, గచ్చిబౌలి- టౌలిచౌకి, వంటి మార్గాల్లో కూడా గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది.జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు రంగంలోకి దిగి వరధ నీటిని తొలగించడం వల్ల కొన్ని ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్య తగ్గింది.