హైదరాబాద్ నగరంలో సోమవారం మరోసారి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతల్లో వరదనీరు రోడ్లపై ఉప్పొంగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్‌లలో భారీగా వర్షం పడుతోంది. కోటి, అబిడ్స్, నాంపల్లి, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.
భారీ వర్షం ధాటికి నగరంలోని అమీర్ పేట్, యూసుఫ్ గూడ ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడి.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్‌లతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. విధులు ముగించుకుని ఇళ్లకు చేరేందుకు ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు.

