చాక్లెట్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలు ఏడుపు మానేయాలంటే ఓ చాక్లెట్ చాలు. క్షణాల్లో వారి ముఖపై చిరునవ్వు తీసుకురావచ్చు. ప్రేయసి అలకను తీర్చడానికి ప్రియుడు చాక్లెట్‌కే ప్రిపరెన్స్ ఇస్తాడు. ఇలా ఏ బంధాన్ని అయినా తీయగా పెనవేసుకునేలా చేసేదే చాక్లెట్. అయితే… ఈ రోజుల్లో చాక్లెట్‌లో ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉన్నా… ఎక్కువ మంది ఇష్టపడేది మాత్రం డార్క్ చాక్లెటే. అయితే.. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. అవెంటో ఇప్పుడు చూద్దాం. డార్క్ చాక్లెట్లు వారానికి రెండు, మూడు సార్లు తినడం వల్ల బీపీ అదుపులోకి వస్తుంది. అది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. అదే విధంగా రక్తం గడ్డకట్టకుండా, ధమనులు గట్టిపడకుండా చూసుకుంటుంది. బ్రెయిన్ పనితీరుపై డార్క్ చాక్లెట్ సానుకూల ప్రభావం చూపిస్తుంది. గుండెకు రక్తప్రసరణ పెంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే రసాయనాలు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే ఫినైలెథిలామైన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది మీలో సంతోషాన్ని కలిగించే ఆలోచనలకు కారణం అవుతుంది.
previous post
next post