telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోవిడ్ టెస్టులో హరీశ్ రావుకు నెగెటివ్

Harish Rao trs

ఈనెల 4న తెలంగాణ మంత్రి హరీశ్ రావు కు హరీశ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన హోం ఐసొలేషన్ కి వెళ్లి, చికిత్స తీసుకున్నారు. తాజాగా నిర్వహించిన కోవిడ్ టెస్టులో హరీశ్ కు నెగెటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. హరీశ్ కోలుకున్నారనే సమాచారంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

తనకు కరోనా సోకినట్టు ఈనెల 5న హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ, టెస్టులో పాజిటివ్ అని తేలిందని వెల్లడించారు. తాను బాగానే ఉన్నానని తనను కలిసిన అధికారులు, ప్రజాప్రతినిధులు టెస్టులు చేయించుకోవాలని ట్విట్టర్ ద్వారా ఆయన సూచించారు.

Related posts